Lokesh: పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ రాష్ట్ర ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. ఆయన ఎక్స్ లో.. "తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా! " అంటూ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్
రూ.100తో రూ.5లక్షల భీమా..!
ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. ప్రతి ఒక్కరూ రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుందని అన్నారు. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది అని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకోండి.. టీడీపీ కార్యకర్తను అని ఘనంగా చాటండని చెప్పారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!
"తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్ ద్వారా అయితే https://bit.ly/4eK2Lj5 లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.me/MyTDP_bot లింక్ ను, లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. " అని పోస్ట్ చేశారు.