Lokesh: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేపట్టారు లోకేష్. కాగా ఈరోజు పర్యటనలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజినీర్ రాబర్ట్ ఎలెన్‌లతో భేటీ అయ్యారు. ఏపీలో బెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. ఈ మేరకు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
మీరు పెట్టుబడులు పెట్టండి...
లోకేష్ ట్విట్టర్ లో.. "ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్‌ను శాన్ ఫ్రాన్సిస్కోలోని సంస్థ కార్యాలయ ఆవరణలో శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించాను. బోసన్ సంస్థ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి ఆన్ వ్యూ సొల్యూషన్స్ ప్రతినిధి జోయల్ వివరించారు. స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ డెమోను ప్రదర్శించారు.
ఫాల్కన్ ఎక్స్ ప్రతినిధులు తమసంస్థ సిరిస్ ఎ స్టార్టప్ లతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న పోర్ట్ ఫోలియోలను వివరించారు. డిజిసెర్ట్ సిఇఓ అమిత్ సిన్హా తమ సంస్థ డిజిటల్ సర్టిఫికేషన్, భద్రతలకు సంబంధించి డిజిసెర్ట్ సురక్షితమైన ఆన్ లైన్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని కోరాను. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపాను." అని పోస్ట్ చేశారు.