Free Bus Scheme: ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తోంది కూటమి సర్కార్. అయితే.. కూటమి సర్కార్ అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ పథకం ఎప్పుడు అమ్మలోకి రానుంది అనే అంశంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
సంక్రాంతి లోపే....
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే ఫించన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ లోపే రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అన్నారు. సంక్రాంతి నుంచే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎన్నో పరిశ్రమలను తీసుకొస్తున్నారని తెలిపారు. కాగా ఇప్పటికే ఈ పథకం అమలు పై విధివిధానాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎన్నో పరిశ్రమలను తీసుకొస్తున్నారని చెప్పారు. ఇప్పుడే ఏపీ అభివృద్ధి బాటలో అడుగు పెట్టిందని అన్నారు.
నిన్న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన...
ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని నిన్న సీఎం చంద్రబాబు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేశారు. కాగా బుకింగ్ చేసుకున్న 48గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చి ప్రతి హామీ నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్ పథకం ప్రారంభమైంది.