/rtv/media/media_files/2026/01/16/sankranthi-2026-01-16-17-55-00.jpg)
Sankranthi
Sankranthi: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి పండగ కోడిపందేలు జోరుగా జరిగాయి. పండగ రెండో రోజు కోడిపందెల ద్వారా లక్షల రూపాయలు చేతులు మారాయి..
పైబోయిన వెంకటరామయ్య బరిలో నడిచిన పందెలలో గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ళ మధ్య భారీ పోటీ జరిగింది. ఈ పందెల్లో రాజమండ్రి రమేష్ విజేతగా నిలిచి రూ.1.53 కోట్లు గెలుచుకున్నాడు.
స్థానికుల ప్రకారం, పశ్చిమగోదావరిలో ఈ ఏడాది ఇది అత్యంత భారీ కోడిపందెం. పందెం గెలిచే అవకాశాలను పెంచుకోవడానికి సరైన సమయం, జాతకం, ముహూర్తం చూసి కోళ్ళను బరిలో పెడుతున్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో కోడిపందెలు జనాలకు మంచి వినోదంగా మారుతున్నాయి.
Follow Us