BIG BREAKING: షర్మిలకు ప్రాణహాని! AP: జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందన్న షర్మిల అన్నారు. అన్నతో ఆస్తి వివాదం తీవ్రస్థాయికి చేరడంతో అదనపు భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 4+4 సెక్యూరిటీతో పాటు వై- క్యాటగిరి భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. By V.J Reddy 31 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Sharmila: జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందన్న షర్మిల అన్నారు. అన్నతో ఆస్తి వివాదం తీవ్రస్థాయికి చేరడంతో అదనపు భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 4+4 సెక్యూరిటీతో పాటు వై- క్యాటగిరి భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. షర్మిలకు ప్రస్తుతం 2+2 భద్రత ఉంది. 100శాతం ఆస్తులు తన పేరు మీద బదిలీ చేస్తానని.. MOUపై సంతకం చేసినపుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా? అని షర్మిల ప్రశ్నించారు. షేర్ల ట్రాన్స్‌ఫర్లకు, బెయిల్‌కు సంబంధం లేదని.. మీక్కూడా తెలుసు కాబట్టే అవన్నీ చేశారని మండిపడ్డారు. షర్మిలకు విజయమ్మ అండ.. గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ ఆస్తుల వివాదంపై వై.ఎస్.సతీమణి విజయమ్మ స్పందించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు తనను చాలా చాలా బాధిస్తున్నాయి అని ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో తనకు అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు... తన ఫ్యామిలీ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. అబద్దాల పరంపర కొనసాగుతుందని.. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారని అన్నారు. అందువల్ల ఇతరులు తమ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దని విజయమ్మ కోరారు. అన్న, చెల్లి ఇద్దరు అంగీకారానికి వస్తారని.. వాళ్లను రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మండిపడ్డారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి