Katasani: ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపొద్దు.. అఖిలకు కాటసాని వార్నింగ్!

అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్ బుక్ చూపించి భయపెడితే ఎవరు భయపడరని అన్నారు. తాను 2004 నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. తిరిగి ఆ సంస్కృతిని తీసుకొచ్చేలా చేయొద్దని కోరారు. వీలైతే ప్రజలకు మంచి చేయాలన్నారు.

author-image
By V.J Reddy
New Update
ex mla katasani

Katasani Ramabhupal Reddy: తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్ బుక్ గురించి అఖిల ప్రియ కంటే ముందు లోకేష్ రెడ్ బుక్ చూపించి మీ కథ చేస్తా అని అంటున్నారని అన్నారు. లీడర్ ఏ దారిలో నడిస్తే ఆ పార్టీ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారని చెప్పారు. ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి నడుస్తాదో చూడాలని అన్నారు.

ప్యాక్షన్ రాజకీయాలు వద్దని 2004లో ఫ్యాక్షన్ రాజకీయాల సంస్కృతికి స్వస్తి పలికాం అని అన్నారు. టీడీపీ నాయకులు అందరూ రెడ్ బుక్ పెట్టుకొని అదే పాలన కావాలంటే ఎవరూ ఏమి చేయలేరని అన్నారు. ప్రజల వద్ద రెడ్ బుక్ పాలన ఇలాంటి రాజకీయాలు చెల్లవు అని చెప్పారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎవరికి ఎలా బుద్ధి చెప్తారో అలా చెప్తారని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల నుండి ఫోన్ వస్తే పోలీసులు వారికి అనువుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ నాయకులు  ఏ పని  చేయాలన్న పోలీసులను అడ్డుపెట్టుకొని పనులు చేస్తున్నారని ఫైరయ్యారు. రెడ్ బుక్ చూపించి తలరాతలు మార్చలేరు అని అన్నారు. సీతారామపురం వైసీపీ నాయకుడు ను అనవసరంగా చంపారని అన్నారు. అఖిల ప్రియ వంద సంవత్సరాలు బతుకుతాను అని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. లోకం లో పుట్టిన ఎవ్వరైనా పంతాలకు పోయిన వారు కాలగర్భంలో కలిసిపోయారని చెప్పారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలి తప్ప రెడ్ బుక్ చూపించి కాలం గడపొద్దని పేర్కొన్నారు.

100 మంది అంటూ..

ఇటీవల తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే కొంతమంది తోలు తీస్తానని ముందే చెప్పానని, ఇప్పుడు తప్పకుండా వాళ్ల భరతం పడతానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను మంచితనం చూపిస్తానని అనుకోవద్దని, లెక్కకు లెక్క తేలుస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఎంతోమంది మీద తప్పుడు కేసులు పెట్టిందని, ఆ వివరాలన్ని తన దగ్గరున్నాయని చెప్పారు. ఈ మేరకు ‘నా దగ్గర రెడ్ బుక్ ఉంది. అందులో 100 మంది పేర్లు ఉన్నాయి. నా వల్ల వంద మంది ఇబ్బందులు పడబోతున్నారు. ఎవర్నీ వదిలిపెట్టను. లీగల్‌గా కేసులు పెట్టిస్తా అంటూ ప్రతిపక్ష నాయకులకు డైరెక్ట్ హెచ్చరికలు జారీ చేశారు. 

Advertisment
తాజా కథనాలు