Diwali: ప్రస్తుత దేశ వ్యాప్తంగా పండుగల సీజన్ నడుస్తోంది. నిన్న మొన్న వరకు రెండు తెలుగు రాష్ట్రాలు బతుకమ్మ, దసరా పండుగలతో సందడి సందడిగా ఉంటే...ఇప్పుడు దీపావళి సందడి సాగుతోంది. దీంతో నగరాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్లు సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
Also Read: జేకే సీఎం ఒమర్ అబ్దుల్లాతో ప్రధాని భేటీ..రాష్ట్ర హోదాపై చర్చ
ఈ క్రమంలోనే.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగను దేశమంతా ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా నార్త్‌లో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ.. ఏకంగా 7 వేల స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లను నడిపించనుండగా.. ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 3050 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నారు.
Also Read: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా అదనంగా మరో 2 లక్షల మంది.. రైళ్లలో ప్రయాణించవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. గురువారం ఓ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల వల్ల.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలతో పాటు.. బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారికి కూడా లబ్ధి చేకూరబోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విశాఖపట్నం, గోరఖ్‌పూర్, అగర్తలా, రక్సౌల్, నాగర్‌సోల్, దానాపూర్, తిరుపతి, నిజాముద్దీన్, సంత్రాగచి, శ్రీకాకుళం వంటి స్టేషన్లు ఉండే రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్లను నడిపించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Also Read: బీఆర్‌ఎస్ మహిళా నేతకు వేధింపులు.. సోషల్ మీడియాలో వైరల్!
శబరిమల యాత్ర కోసం..
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులు చేపట్టనున్న శబరిమల యాత్ర కోసం ప్రత్యేకంగా.. భారత్ గౌరవ్ రైలును నడుపుతున్న ఇప్పటికే ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక ట్రైన్ ప్యాకేజీలో.. శబరిమల అయ్యప్ప దేవాలయంతో పాటు.. ఛొట్టనిక్కారా దేవి ఆలయాలు కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది.
Also Read: గొంతులో ఏదైనా ఇరుక్కుందా..అయితే కంగారు పడొద్దు..ఇలా చేయండి చాలు!
నవంబరు 16వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక రైలు.. తెలంగాణ, ఏపీలోని 10 రైల్వే స్టేషన్లలో ఆగనుంది. నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరులో ఈ రైలుకు స్టాప్స్ ఉన్నాయి. మొత్తంగా 4 రాత్రులతో 5 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్యాకేజీలో వసతి, భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.11,475, థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.18,790, సెకండ్ ఏసీ టికెట్ ధర రూ.24,215 గా నిర్ణయించారు.