Vishakapatnam Fire Accident: విశాఖ నగరానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్యాంకుకు సంబంధించిన ఫైల్స్ తదితర సామాగ్రి ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. తెల్లవారి 8:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సుమారు నాలుగు ఫైర్ ఇంజన్లు 30 మంది ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు సకాలంలో వచ్చి ఈ ప్రమాద తీవ్రతను తగ్గించినట్లు అధికారులు చెప్పారు.
Video: