6వేల ఉద్యోగాలపై మంత్రి అనిత గుడ్ న్యూస్.. థాంక్స్ చెప్పిన లోకేష్! AP: పెండింగ్‌లో ఉన్న 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. 5 నెలల్లో కానిస్టేబుళ్ల భర్తీ శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. By V.J Reddy 01 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Constable Jobs: ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోంమంత్రి అనిత అన్నారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపిక అయ్యారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ (సివిల్)- 3580; కానిస్టేబుల్ (APSP) -2520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడినట్లు చెప్పారు. దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (slprb.ap.gov.in) వెబ్ సైట్ లో పొందుపరుస్తామని ఆమె అన్నారు. రెండవ ధశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని తెలిపారు. ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేశారు. "హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని వారు కోర్టును కోరారు. ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రి వివరించారు. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. హోంమంత్రికి లోకేష్ థాంక్స్... కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై హోంమంత్రి అనిత ఇచ్చిన అప్డేట్ పై మంత్రి లోకేష్ థాంక్స్ చెప్పారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో.. "అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించిన హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత గారికి ధన్యవాదాలు. ప్రిలిమినరీ పరీక్ష తరువాత రిక్రూట్మెంట్ రెండవ దశలో జరగాల్సిన శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాలతో వాయిదా పడటం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ``ప్రజాదర్భార్``కు వచ్చిన నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు. వీరి వినతిని పరిశీలించాలని హోం మంత్రి గారికి పంపగా, వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్రక్రియలో తరువాత దశలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది కానిస్టేబుల్ అర్హత పరీక్ష పాసైన నిరుద్యోగులకు చాలా సంతోషకరమైన సమాచారం." అని అన్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి