కడప జిల్లాలో హైటెన్షన్.. కూటమిలో చిచ్చు!

AP: కడప జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తన వాహనాలు RTPPకి వెళ్లకుండా MLA ఆదినారాయణ వర్గీయులు అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్ ఆగ్రహానికి గురయ్యారు. తాను RTPPకి వస్తున్నట్లు చెప్పారు. దీంతో అక్కడికి టీడీపీ కార్యకర్తల భారీగా చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

New Update

JC Prabhakar: కడప జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కడప జిల్లా ఎర్రగుండ మండలంలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నుంచి తాడిపత్రిలోని ఎల్‌అండ్‌టీ సిమెంట్‌ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్‌ తరలింపులో ఇరువురి మధ్య వివాదం రాజుకుంది. జేసీ వాహనాలను ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.

చేసుకుందామా?.. జేసీ సవాల్...!

తన వాహనాలను అడ్డుకున్న నేపథ్యంలో RTPPకి వస్తానన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జేసీ వస్తానని చెప్పడంతో ఇప్పటికే RTPPకి భారీగా జేసీ వర్గీయులు చేరుకున్నారు. జేసీని అడ్డుకునేందుకు కడప-అనంతపూర్‌ బార్డర్‌ వద్ద పోలీస్‌ బలగాలు భారీగా మోహరించారు. కొండాపురం మండలం సుగమంచిపల్లి వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఏ క్షణమైనా జేసీ కడపకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Advertisment
తాజా కథనాలు