షర్మిలకు కౌంటర్‌గా జగన్ సంచలన వ్యూహం!

AP: ఆస్తుల గొడవ నేపథ్యంలో పులివెందులలో జగన్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన బంధువులను కలిసి మద్దతు కూడగట్టుకునే పనిలో జగన్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తన మేనమామ, బాబాయ్ వాళ్ళతో జగన్ సమావేశం అయ్యారనే చర్చ జరుగుతోంది.

New Update

YS Jagan: మాజీ సీఎం జగన్ ఆస్తుల వివాదం ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్తుల గొడవ నేపథ్యంలో పులివెందులలో జగన్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన బంధువులతో వన్‌ టు వన్‌ మాట్లాడారు జగన్‌. వైఎస్‌ కుటుంబం పెద్ద ప్రకాష్‌రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లి మరీ మాట్లాడారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి, చిన్నానలు దుగ్గాయపల్లి మల్లిఖార్జున్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, మేనమామ రవీంద్రనాధ్‌ రెడ్డితోనూ కూడా జగన్‌ మాట్లాడారు. తనకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్‌. అనంతరం జగన్ ఇడుపులపాయ నుంచి బెంగళూరుకు వెళ్లారు.

జగన్ మోసం చేశారు: షర్మిల!

ఇటీవల తన అన్న జగన్, కు తనకు మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదంపై షర్మిల బహిరంగ లేఖ రాసి క్లారిటీ ఇచ్చారు. షర్మిల లేఖలో.. "నాన్న బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా... భారతి సిమెంట్స్ అయినా... సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ. యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా... నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి. అన్నది వైఎస్ఆర్ మాండేట్. (ఒక్క సండూరు మినహాయించి) రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన. అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు.. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. 

ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు నీకు. ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే. నేను జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాట అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి గారు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబట్టే.. ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం గనుక, ఈ రోజు వరకు కూడా అమ్మైనా. నేనైనా తపన పడుతున్నాం." అని పేర్కొంది

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe