AP News: ఏలూరు జిల్లాలో జోరుగా ఫేక్ సర్టిఫికెట్ల దందా..అక్రమార్కుల ఆట కట్టించిన పోలీసులు
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
సీఎం జగన్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకు పడ్డారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
స్కిల్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి(నవంబర్ 1) వరకు మీడియాతో మాట్లడొద్దని ఆదేశించింది. ఎలాంటి రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ తమ మెమోలో కోరడంతో హైకోర్టు ఇలా చెప్పింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందాల్లో మునిగిపోగా.. ఇదే సమయంలో వారికి మరో గుడ్న్యూస్ తెలిసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకు మద్యం కేసులో అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ఏజీ తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చిన క్రమంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ క్రమంలో ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ వరకు భారీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు నాయిడు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలకానున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ నివాసానికి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. యుద్ధం ఇప్పుడే మొదలైందని ఈ రోజు తనను కలిసిన నేతలతో లోకేష్ అన్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ఏళ్లకు పైగా చరిత్రతో పాటు లక్షలాదిమంది నమ్మకస్తులైన కార్యకర్తలతో, సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంతో పాటు బలమైన రాజకీయ పక్షంగా మనుగడ సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్నదని చెబుతున్నారు విశ్లేషకులు చలసాని నరేంద్ర. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి, జైలుకు పంపి 50 రోజులు అవుతుండగా, ఒక విధంగా టీడీపీ రాజకీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి.
చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనేశ్వరి చెప్పినట్లు నిజం గెలవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. నాడు రెండెకరాల భూమి.. రెండు సెంట్ల ఇల్లు మాత్రమే కలిగిన ఉన్న చంద్రబాబుకు.. నేడు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆస్తులపై సీబీఐ విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు మంత్రి రోజా.