కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి !

కాకినాడ జిల్లా శలపాకలో దారుణం జరిగింది. నిన్న రాత్రి 11గంటల సమయంలో గ్రామంలోని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన బత్తుల రమేష్,బత్తుల రాజు, బత్తుల చిన్న అక్కడిక్కడే మృతి చెందారు.

New Update

Kakinada:  కాకినాడ జిల్లా దారుణం ఘటన చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన ఇరువర్గాలు ఒకరి పై ఒకరు దాడికి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ  సంఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలం శలపాక శివారులో చిన్నంపేట గ్రామంలో జరిగింది.

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 

అయితే నిన్న రాత్రి చిన్నంపేట గ్రామంలో ఎదురెదురు ఇళ్లల్లో నివాసముంటున్న ఇరు కుటుంబాలు కలహాలతో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా  దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన బత్తుల రమేష్,బత్తుల రాజు, బత్తుల చిన్న అక్కడికక్కడే మృతి తీవ్రంగా గాయపడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పొట్లకాయ నాగేశ్వరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు సమాచారం ప్రకారం అక్రమ సంబంధం,పాత కక్షలు నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయని తెలుస్తోంది. దాడికి పాల్పడిన ఇరు కుటుంబాలు ఒకే సామజిక వర్గానికి చెందిన వారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  అలాగే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 

ఇది కూడా చదవండి: VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం

ఇటీవలే ఒడిశాలో దారుణం 

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కట్టుకున్న భర్తే భార్యను దారుణంగా చంపేశాడు. ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ప్రద్యుమ్న కుమార్‌కు 2020లో శుభశ్రీ అనే అమ్మాయితో పెళ్లైంది. పెళ్ళైన కొన్నాళ్ళకు ప్రద్యుమ్న భార్యను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది. ఈ సమయంలో ప్రద్యుమ్నకు  తన హాస్పిటల్ లో పనిచేసే ఇజిత భూయాన్‌, రోజీ అనే నర్సులతో కుమార్ కు పరిచయం ఏర్పడి.. కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయాలన్ని తెలిసిన శుభశ్రీ  ఒకరోజు తిరగబడిన భర్తను, అతని ప్రియురాళ్లను నిలదీసింది. దీంతో ఆమె అడ్డుతొలగించాలని ప్లాన్ చేసిన భర్త, అతని ప్రియురాళ్లు ఆ అమాయకురాలిని దారుణంగా హత్య చేశారు. 

అక్టోబర్‌ 27న ప్రద్యుమ్న భార్య  శుభశ్రీని సాంపుర్‌లోని రోజీ ఇంటికి తీసుకొచ్చి.. ఆమెకు బలవంతంగా  అధిక మోతాదులో మత్తు మందు ఎక్కించి చంపారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు చేసుకోవడానికి ప్రయత్నించినట్లుగా చిత్రీకరించారు. పోస్ట్ మార్టం చేయడంతో అసలు విషయం బయటపడింది. 

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లో మెసేజ్, మూడు వారాల్లోనే పెళ్లి.. దుల్కర్ లవ్ స్టోరీ తెలిస్తే షాక్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe