Vijayawada: విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌..దుబాయ్‌!

విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌, దుబాయ్‌ కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.ఆయన శనివారం ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా ఆరంభించారు.

ramohan
New Update

Vijayawada: విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌, దుబాయ్‌ కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. విజయవాడ విమానాశ్రయ మెయిన్‌ గేట్‌ వద్ద నుంచి జాతీయ రహదారిని కలుపుతూ వేసిన అప్రోచ్‌ రోడ్డును ఆయన శనివారం ప్రారంభించారు. ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా ఆరంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అమరావతికి దేశంలోని ఏ నగరం నుంచైనా తేలికగా వచ్చి వెళ్లేలా విమాన అనుసంధానం ఏర్పాటు పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విజ్ఙప్తి చేశారు.

ఈ మేరకు వరుసగా నూతన సర్వీసులను ఆరంభిస్తున్నాం.ఈ మూడు నెలల్లోనే విజయవాడ నుంచి నాలుగు కొత్త సర్వీసులను ప్రారంభించారు. ఇక్కడ నుంచి ఎన్నికల ముందుతో పోలిస్తే ప్రస్తుతం ప్రయాణికులు గణనీయంగా పెరిగారు. గతంలో నెలకు సగటున 85 వేల మంది ప్రయాణించగా…ప్రస్తుతం లక్షకు చేరారు అని తెలియజేశారు.

దేశంలోని విమానాశ్రయాలన్నింటిలో కలిపి ఇప్పటి వరకు 80 వేల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు దానిలో భాగంగా విజయవాడలోనే వెయ్యి నాటనున్నామని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

విజయవాడ విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ ను వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మైసూరు ఎంపీ యుదువీర కృష్ణదత్త, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.

Also Read: బుడమేరు కట్ట తెగలేదు– మంత్రి పొంగూరు నారాయణ

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe