Cyclone Montha Precautions: ప్రజలారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి - లేదంటే ప్రాణాలు పొతాయ్..!

ఏపీలో మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ ఇది మరింత ఉగ్రరూపం దాల్చనుంది. మరీ ముఖ్యంగా నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుంది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి 4.7 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని IMD, మINCOIS హెచ్చరించాయి.

New Update
Cyclone Montha Precautions

Cyclone Montha Precautions

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ ఇది మరింత ఉగ్రరూపం దాల్చనుంది. మరీ ముఖ్యంగా నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుంది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి 4.7 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని IMD, మINCOIS హెచ్చరించాయి. తుఫాను సమీపిస్తున్న కొద్దీ కఠినమైన వాతావరణం, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపాయి. 

ఇది నేడు (అక్టోబర్ 28) సాయంత్రం లేదా రాత్రి నాటికి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల మేర వీస్తాయని.. గాలులు గంటకు 110 కిలోమీటర్ల వరకు ఉంటాయని అంచనా వేసింది. అందువల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతేనే గాని బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో మొంథా తుఫాను సమయంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులు ప్రజలకు అవగాహన చేస్తున్నారు. 

Cyclone Montha Precautions

ప్రజలు ఎలాంటి రూమర్స్‌ను నమ్మవద్దు. ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.

అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండండి. 
వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనిస్తూ ఉండండి.

మీ భద్రత, మనుగడ కోసం అవసరమైన వస్తువులను (అత్యవసర వస్తు సామగ్రిని) సిద్ధం చేసుకోండి.

ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళండి.

మీ పత్రాలు/సర్టిఫికెట్స్, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు/కవర్‌లో ఉంచండి.

ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. అన్ని ఎలక్ట్రికల్ వస్తువులు, గ్యాస్ కనెక్షలను తీసివేయండి. తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.

మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుపాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి.

పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల కింద ఎప్పుడూ ఉండకండి.

పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయండి.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకండి.

అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లను సంప్రదించండి. 

image (2)

Advertisment
తాజా కథనాలు