Chandrababu: జగన్‌కు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్! జగన్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. దీని గురించి అడిగితే తమపై దాడికి దిగుతున్నారని ఫైరయ్యారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. By V.J Reddy 24 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి CM Chandrababu: తిరుమల లడ్డూ వివాదం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు సీఎం చంద్రబాబు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చని అన్నారు. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం అని... నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు. అది అడిగితే బూతులు తిట్టారు అని మండిపడ్డారు. మనోభావాలను దెబ్బ తీశారు... ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? వైసీపీ వాళ్ళు అన్నారని గుర్తు చేశారు. హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?... రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారని అన్నారు. రధం కాలిపోతే…. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుంది అని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బాధపడుతూ చెబుతున్నానని. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందేది మన బాధ అని అన్నారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలని కోరారు. "ఇక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్టు కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం." అని అన్నారు. ఆయన (వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి) దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు… pic.twitter.com/nTDsLp4ubB — N Chandrababu Naidu (@ncbn) September 24, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి