CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు ఏపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
ALSO READ: ఏపీ మద్యం టెండర్స్ వ్యవహారంలో గోల్‌మాల్
రేపు మోదీ.. ఎల్లుండి అమిత్ షా..
రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. కాగా మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. పలు కీలక అంశాలపై వారితో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు కారణమైన బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం కావడం ఇదే తొలిసారి. రైల్వే జోన్, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రగులుతున్న సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై మోదీతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఈ పర్యటనలో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుంచి వస్తున్న నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు ప్రధాని మోదీని కోరనున్నట్టు తెలుస్తోంది.