/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
CM Chandrababu: సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ నగరంలో రెండు ఫంక్షన్స్ లో పాల్గొననున్నారు. ఉదయం 11.15 కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడ నుంచి కొత్వాల్ గూడలోని ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 12.30 కి అక్కడి నుంచి బయల్దేరి ఉస్మానియా నగర్ తారామతి బారాదరి లోని వేసేళ్ల మెడోస్ కు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని 1.20 కి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 65 లోని తన నివాసానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కాగా ఏపీలో తిరిగిన సీఎం అయిన చంద్రబాబు తెలంగాణకు ఎక్కువగా వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవడమే అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.