నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో తిరుపతి లడ్డూ వివాదం, ఎన్నికల ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.

New Update
AP: ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై కీలక చర్చ..!

AP Cabinet Meet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి రాష్ట్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి లడ్డూ వివాదం, ఎన్నికల ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే పెన్షన్ పెంపు, మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు, ఉచిత ఇసుక, చెత్త పన్ను రద్దు వంటి పలు కీలక హామీలను అమలు చేసిన కూటమి సర్కార్.. ఈ రోజు జరిగే మంత్రివర్గం సమావేశంలో మరిన్ని పథకాలకు శ్రీకారం చుటనున్నట్లు సమాచారం.

దసరా నుంచే...

ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి దసరా పండుగ సమీపిస్తున్న క్రమంలో చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఇసుక కోసం ఇక్కట్లు పడుతున్న వారికి కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. ఈ నెల 15 నుంచి ఇసుక రీచ్‌లలో పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అక్టోబర్ 15 నుంచి ఏపీలో ఇసుక కొరత ఉండదని అన్నారు. 15 నుంచి అందరికి ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. వానాకాలంలో వస్తున్న వరదలను దృష్టిలో ఉంచుకొని గతంలో  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక రీచ్‌లలో తవ్వకూడదని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకే రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు