Chandrababu : ఎవ్వరినీ వదిలిపెట్టను.. మంత్రులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్‌!

రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు సమాచారం. అలాగే వైన్ షాపుల విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తగా మంత్రులపై సీరియస్ అయ్యారు.

AP CM Chandrababu Naidu
New Update

రాష్ట్ర కేబినెట్‌ సమావేశం బుధవారం హాట్‌హాట్‌గా సాగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక విధానం లక్ష్యం నెరవేరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ఇబ్బందులు పడటంతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రిమండలి సమావేశంలో చంద్రబాబు ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంతో పాటు ఇంటి నిర్మాణంలో ఇసుక కొనుగోలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే కొందరు దళారులు సామాన్య ప్రజలకు ఇసుకను భారంగా మార్చడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉచిత ఇసుక విధానంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, వెంటనే మార్పు రావాలని చంద్రబాబు ఆదేశించారు.

ఇది కూడా చదవండిః జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!

వెంటనే మార్పు రావాలి

ఉచిత ఇసుక విధానంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, వెంటనే మార్పు రావాలని చంద్రబాబు ఆదేశించారు. పది రోజుల్లో మార్పు కనిపించాలని, నిజమైన లబ్ధిదారుడికి ఉచిత ఇసుక పథకంతో ప్రయోజనం కలగాలని సీఎం పేర్కొన్నారు. ఇసుక రాష్ట్రంలో విరివిగా దొరకాలని, అన్ని అడ్డంకులు తొలగించి సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందించి తీరాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

మద్యం షాపుల్లో వేలు పెట్టొద్దు..

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే వైన్ షాపుల విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం చంద్రబాబు మంత్రులపై సీరియస్ అయ్యారు. మంత్రులతో పాటు వారి పరిధిలోని ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని, వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయిపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎక్కడ నేరం జరిగినా గంజాయ్ బ్యాచ్ ఉంటుందని మండిపడ్డారు. ఇకపై గంజాయికి రాష్ట్రంలో చోటు ఉండకూడదని తెలిపారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే సంఘ బహిష్కరణేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండిః పవన్‌ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్.. కీలక బాధ్యతలు..!

పారిశ్రామిక పాలసీకి పచ్చజెండా..

సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ 2024-29 పారిశ్రామిక అభివృద్ధి పాలసీని రూపొందించారు. అలాగే ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్రోత్సాహకాలను కూడా ఎస్క్రో ఖాతాలో వేసేలా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీకి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాలసీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటుగా ఆహారశుద్ధి విధానంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా పాలసీ రూపకల్పనపై కూడా ఏపీ కేబినెట్ చర్చించినట్లు సమాచారం. ఇక మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూమి కేటాయింపులపైనా ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండిః నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితోపాటు డ్రగ్స్ కట్టడి, అక్రమ మద్యం అమ్మకాల నియంత్రణ కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. రాజధాని అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

హర్యానాకు సీఎం చంద్రబాబు

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు, చెత్త పన్ను రద్దు, దేవాలయాల్లో పాలక మండళ్ల నియామకం, కొత్త మున్సిపాలిటీలలో పోస్టులు వంటిపైనా ఏపీ మంత్రివర్గం చర్చిస్తోంది. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా కూడా సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు రేపు హర్యానా వెళ్లనున్నారు. హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల వరకూ చంఢీగ‌ఢ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం చండీగఢ్‌లో జరిగే ఎన్డీయే పక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

ఇది కూడా చదవండిః నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

#chandrababu-naidu #ap-tdp #ap-cm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe