గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయవద్దు అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైన ఆదేశాలను బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!
New Update

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు చెత్త పన్ను భారం నుంచి ఉపశమనం కల్పించనున్నారు. ఈ మేరకు ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను వసూళ్లకు బ్రేక్ వేశారు. చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చెత్త పన్ను ఎక్కడ వసూలు చేయొద్దని.. ఎవరైనా దేశాలను బేఖాతర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గాంధీ జయంతి రోజున మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.

గత ప్రభుత్వం ధ్వంసం చేసింది..

2019లో వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు. రోడ్లపై చెత్త పేరుకుపోతే కనీసం దాన్ని కూడా తీయలేని పరిస్థితి నాటి ప్రభుత్వానిదని ఫైర్ అయ్యారు. ఇప్పటికీ 85 లక్ల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయిందని అన్నారు. సంవత్సరంలోపు చెత్త మొత్తం శుభ్రం చేయాలని మంత్రి నారాయణను ఆదేశించినట్లు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ ధ్యేయంగా అందరు ముందుకెళ్లాలని అన్నారు. 2029 నాటికి ఏపీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా కావాలని చెప్పారు.  ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో రోడ్లపై చెత్త ఉండకూడదని అన్నారు. పింగళి వెంకయ్య పేరు మీద వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని అన్నారు.

 

దీపావళి నుంచే షురూ...

ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‎ను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పేదలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలను కాస్త ఆలస్యం అయినా.. తప్పకుండ అమలు చేసి తీరుతామని అన్నారు. 

 

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe