ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్ AP: మద్యం ప్రియులకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఈరోజు నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభం కాగా... పాత ధరలకే మద్యం అమ్మకాలు జరపడంపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత స్టాక్ రావడం వల్లే పాత ధరలకు అమ్ముతున్నామని వైన్స్ యజమానులు చెబుతున్నారు. By V.J Reddy 16 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి AP Liquor: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. నూతన మద్యం పాలసీ అమలు చేయడంతో మద్యం ధరలు తగ్గుతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మద్యం బాబులకి నిరాశ ఎదురైంది. కొత్త మద్యం షాపుల్లో తక్కువ ధరకే మద్యం లభిస్తుందని తెల్లవారుజాము నుండి ఎదురుచూసిన మద్యం బాబులకి.. పాత మద్యం ధరలకే మద్యం విక్రయిస్తుండడంతో మందు బాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్... రేపు కీలక ప్రకటన! తక్కువ ధరకే అంటూ... ఎన్నికల సమయంలో నాణ్యమైన మధ్యాన్ని, తక్కువ ధరకే ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం... మద్యం ధరలు ఎక్కడ తగ్గించలేదని వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎలాంటి రేట్లు ఉన్నాయో అలాంటి రేట్లు తోనే మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం మమల్ని మోసం చేసిందని మందు బాబులు ఫైర్ అవుతున్నారు. కాగా కేవలం రూ.99కే నాణ్యమైన అందిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: నేడు కోర్టుకు సీఎం రేవంత్..కానీ! పాత స్టాక్ అంటూ... కాగా పాత ధరలే ఉండడంపై మద్యం షాపు యజమానులను ప్రశ్నించగా.. పాత ధరల ప్రకారమే స్టాక్ వచ్చిందని చెబుతున్నారు. గోదాముల్లో భారీగా పాత స్టాక్ మిగిలిపోవడంతోనే ఎక్సైజ్ శాఖ అధికారులు అవే సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. పాత రేట్లకే మద్యం విక్రయాలు క్వార్టరుకు(180ml) రూ.150,బీరు రూ.200లకు అమ్ముతున్నారు. పాత ధరలకే మద్యం అమ్ముతున్న క్రమంలో మద్యం ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! ప్రతి షాపులోనూ డిజిటల్ పేమెంట్స్.. ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా నిర్ణయం తీసుకుంది సర్కార్. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్ధతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి