వైసీపీ మాజీ మంత్రికి షాక్.. కేసు నమోదు!

AP: వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు షాక్ తగిలింది. ఆయనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద రూ. 90 లక్షలు తీసుకుని మోసం చేశారని తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Vijayawada: అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేశారు : మంత్రి మేరుగ నాగార్జున

Merugu Nagarjuna: వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు షాక్ తగిలింది. ఆయనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద రూ. 90 లక్షలు తీసుకుని మోసం చేశారని తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజుకు విజయవాడ మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చంద్రబాబుపై మెరుగు మండిపాటు...

ప్రజలను నిట్టనిలువునా ముంచాడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. 6,072 కోట్ల విద్యుత్ ఛార్జీల బాదుడుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. యూనిట్‌ మీద రూ.1.58 పైసలు నవంబర్‌ నుంచి 15 నెలలు బాదుడే అని అన్నారు. మాటలు చెప్పడం, హామీలు ఇవ్వడం ఎన్నికల తర్వాత తెప్ప తగలేయడం బాబు నైజం అని విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని అన్నారు. అడ్డగోలుగా విద్యుత్‌ ఒప్పందాలు చేసి కమీషన్లు కొట్టేసిన చరిత్ర చంద్రబాబుది అని చురకలు అంటించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు