ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే?

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. అది గమనించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న తండ్రి కూతురిని రక్షించాడు. సాయిబాబు సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు.

car
New Update

ఓ తండ్రీ కూతురు కలిసి కారుల వస్తున్నారు. ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఆ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఆపై పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అందులోనే తండ్రీ కూతురు ఇరుక్కుపోయారు. బయటకు రాలేని పరిస్థితి.

యువకుడి సాహసం

దీంతో ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఓ యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. వెంటనే కాలువలోకి దూకాడు. ఆపై కారు అద్దాలు పగులగొట్టి ఆ తండ్రీకూతురిని కాపాడాడు. అతడి సాహసానికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇది కూడా చదవండి: అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు!

పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లి్ంది. వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఆ ప్రమాదాన్ని గమనించిన సాయిబాబు అనే యువకుడు వెంటనే కాలువలోకి దిగాడు.

ఇది కూడా చదవండి: తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్

ఆపై ఒక రాడ్‌తో కారు అద్దాలను పగలగొట్టాడు. అనంతరం ఆ లోపల చిక్కుకున్న తండ్రీ, అతని కూతురిని రక్షించాడు. స్థానిక అధికారులు యువకుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. వాహనం కాలువలోకి పడిపోవడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

#west-godavari-district #tanuku
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe