Merugu Nagarjuna: వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బుధవారం ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి మెరుగుపై ఫిర్యాదు చేసిన బాధితురాలు హాజరైంది. విచారణలో బాధితురాలు చెప్పిన మాటలకు అందరు ఆశ్చర్యపోయారు. మెరుగు నాగార్జున మీద తప్పుడు అత్యాచారం కేసు పెట్టానని.. పోలీసులు కావాలంటే ఆ కేసును కొట్టేయాలని కోరారు.
జడ్జి ఆగ్రహం...
కోర్టులో బాధితురాలు కోరిన విజ్ఞప్తిపై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో తప్పుడు కేసు పెట్టి.. కోర్టుకు వచ్చి ఆ కేసును కొట్టేయమనడం.. తరచూ జరుగుతున్న సంఘటనలని అన్నారు. ఈ మేరకు బాధితురాలు కోరిన విజ్ఞప్తిని తిరస్కరించారు. కోర్టులో విచారణకు హాజరైన బాధితురాలు.. తాను కావాలనే నాగార్జునపై తప్పుడు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపింది.
అలా కేసు కొట్టేయమని కోరగానే కేసును కొట్టేయలేమన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్ల తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ కేసును పూర్తిగా విచారించి నివేదిక కోర్టుకు ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేశారు. అయితే ఈ కేసులో మాజీ మంత్రి మెరుగును పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరగా.. వారి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.