Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట AP: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అతనిపై తిరుపతి పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును కొట్టేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 25 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసు డిస్మిస్ చేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. కాగా ఆదిమూలంపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాంప్రమైజ్.. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక ఆరోపణల కేసు క్వాష్ చేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఇరు పక్షాలు కాంప్రమైజ్ కావడంతో పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఈ మేరకు రేప్ కేసు పెట్టిన బాధితురాలు.. తాను చేసిన ఆరోపణలు అబద్ధమని హైకోర్టుకు వివరించగా ఆదిమూలంపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తర్వాతి విచారణను సెప్టెబంర్ 25కు వాయిదా వేసింది. ఇక లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి కోనేటి ఆదిమూలంను చంద్రబాబు సస్పెండ్ చేశారు. బెదిరించి లైంగిక దాడి చేశాడంటూ.. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు తనను బెదిరించి లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఆదిమూలంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జరిగిన విచారణలో ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించింది. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని చెప్పారు. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై ఆ మహిళ ఫిర్యాదు చేశారన్నారు. బాధిత మహిళ తరఫున న్యాయవాది కె. జితేందర్ వాదనలు వినిపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. దానిని పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోరారు. ప్రైవేటు హోటల్లో ఏకాంతంగా గడుపుతూ.. మహిళా నాయకురాలితో ప్రైవేటు హోటల్లో ఆదిమూల ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలను ఆ బాధిత మహిళ విడుదల చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పై ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. తన కోరికలు తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరిస్తున్నాడని బాధిత మహిళా పేర్కొంది. టీడీపీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళా సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేసినట్లు పేర్కొంది. రాత్రి పూట మెసేజ్‌లు చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడని తెలిపింది. ఎమ్మెల్యే చేసే ఇలాంటి పనులకు తిరుపతి భీమా ప్యారడైజ్ హోటలే అడ్డా అని ఆమె తెలిపింది. ఇలాంటి వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబును బాధిత మహిళా నాయకురాలు డిమాండ్ చేసింది. దీంతో టీడీపీ హైకమాండ్ ఆదిమూలంపై సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి