AP Rains:
ఏపీకి తుపాన్ల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఒకటి... బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది వాతావరం శాఖ.
తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. ఏపీలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గత నెలలో వచ్చిన తుపాన్ నుంచి ఏపీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. విజయవాడను బుడమేరు ప్రవాహం ముంచేసింది. మళ్లీ తుపాన్లు వస్తే పరిస్థితి ఏంటని జనం భయపడుతున్నారు.