53 రోజుల చీకటి జైలు జీవితం.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన చంద్రబాబు!

బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న ఏపీ CM చంద్రబాబు.. 53 రోజుల చీకటి జైలు జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "ఆ రాత్రి చేయని తప్పుకు శిక్ష అనుభవించడం.. అది జరిగిన విధానం గుర్తొచ్చినప్పుడలా గుండె తరుక్కుపోతుంది'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

chandrababu (00

chandrababu Naiu

New Update

Chandrababu Naiu: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య హోస్ట్ వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్' విత్ NBK. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ పూర్తి చేసుకున్న ఈ 4 లో అడుగుపెట్టింది. సీజన్ 4లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్టుగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందడి చేశారు.  ఈ షోలో చంద్రబాబు తన రాజకీయ జీవితానికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. 

హోస్ట్ బాలయ్య చంద్రబాబును .. ''53 రోజుల చీకటి జైలు జీవితం.. మొదటి రాత్రి జైలులో ఎలా గడిచింది''? అని ప్రశ్నించారు. 

చనిపోతే ఒక్క క్షణం.. అదే ఆశయాల కోసం పనిచేస్తే శాశ్వతం

ఈ ప్రశ్న పై  చంద్రబాబు స్పందిస్తూ.. "ఆ రోజు నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా మీదుగా అడవులు దాటుకుంటూ అమరావతికి తీసుకొచ్చారు. రాత్రంతా ఇన్వెస్టిగేషన్ తిప్పారు. తెల్లవారుజామున మెడికల్‌ టెస్ట్‌కు పంపించారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడా, ఇక్కడా తిప్పి కోర్టుకు తీసుకురావడం,  వాదనల నెపంతో సాయంత్రం వరకు అక్కడే ఉంచి.. అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు పంపారు. ఆ రాత్రి చేయని తప్పుకు శిక్ష అనుభవించడం.. అది జరిగిన విధానం గుర్తొచ్చినప్పుడలా గుండె తరుక్కుపోయింది. నేను దైర్యం కోల్పోతే ఏమీ ఉండదు. పరిస్థితులను దైర్యంగా ఎదుర్కొన్నాను..  అందుకే నా జోలికి రాలేకపోయారు. ఒకవేళ నేను అధైర్య పడితే ఏమయ్యేదో!  జైల్లో ఉన్నప్పుడు నేను ఒక్కటే ఆలోచించాను.. చనిపోతే ఒక్క క్షణం.. అదే అనుకున్న ఆశయాల కోసం పనిచేస్తే అదే శాశ్వతం. అదే ఆరోజు నన్ను  ముందుకు నడిపించింది" అంటూ ఆ చీకటి రోజుల గురించి చెబుతూ  భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. 

Also Read: వామ్మో! అంత ఖరీదైన రిసార్టులో పూజ బర్త్ డే.. ఒక్కరోజుకు ఎన్ని లక్షలంటే?

Also Read: కేథార్‌నాథ్‌ లో మోహన్ బాబు, మంచు విష్ణు.. ఎందుకో తెలుసా ?

Also Read: ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా.. వీళ్లిద్దరే ప్రభాస్ ఫేవరేట్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe