కొత్త రేషన్‌ కార్డులపై BIG UPDATE

AP: అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు!
New Update

Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ, ఉన్న వాటిలో మార్పులు వంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో జరుగనున్న కేబినెట్ భేటీలో మంత్రి వర్గం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా.. కొత్తగా రేషన్‌ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

పాత బకాయలు..

గత వైసీపీ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674.40 కోట్ల మొత్తాన్ని ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం చెలించేందుకు సిద్ధమైంది. కాగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదట్లోనే తొలి విడత కింద రూ.వెయ్యి కోట్లు, రెండో విడతగా కింద రూ.674.40 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. 

ఇంటికే రేషన్ సరుకులపై..

ఇంటి ముందుకే వాహనాల ద్వారా వచ్చే రేషన్ సరకుల పంపిణీపై త్వరలోనే చంద్రబాబు సర్కార్ తుది న నిర్ణయం తీసుకోనుంది. రేషన్ వాహనాల్లో పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభనష్టాలపై అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో అధికారులు ఇచ్చిన నివేదికపై ఆమోద ముద్ర వేసే ఆలోచలనలో కేబినెట్ ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం  6 వేల రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనుంది.

మంత్రివర్గం చర్చించే అంశాలు!

* కొత్త రేషన్‌ కార్డుల మంజూరు
* కుటుంబాల విభజన
* కుటుంబ సభ్యుల చేర్పు
* కుటుంబ సభ్యుల తొలగింపు
* చిరునామా మార్పు
* కార్డులను సరెండర్‌ చేయడం

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe