ఏపీలో మందుబాబులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రూ.99కే క్వార్టర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు నుంచి ఇందుకు సంబంధించిన అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. అయితే.. ప్రస్తుతానికి సప్లై తక్కువగా ఉండడంతో ఒక్కే షాపునకు3 నుంచి 8 కేసులు మాత్రమే సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇటీవల నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది చంద్రబాబు సర్కార్.
మొత్తం 3,396 షాపులు..
ప్రభుత్వ మద్యం షాపులను తొలగించి.. వాటి స్థానంలో ప్రైవేటు షాపులను తీసుకువచ్చారు. ఇటీవల లాటరీ ద్వారా ఆ షాపులను కేటాయించారు. షాపుల కేటాయింపుతో ప్రభుత్వానికి 1800 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తం 3, 396 మద్యం షాపులు ఏపీ వ్యాప్తంగా ఏర్పాటయ్యాయి.