BIG BREAKING: జ‌గ‌న్‌కు బిగ్ షాక్.. ఆ ఎన్నిక రద్దు చేసిన ఈసీ!

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను ఈసీ రద్దు చేసింది. వైసీపీకి అక్కడ గెలపు కోసం కావాల్సిన సభ్యులు ఉన్నారు. దీంతో అక్కడ గెలిచి మండలిలో సభ్యుల బలం పెంచుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు షాక్ తగిలింది.

Election Commission of india
New Update

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజుపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. మండలి చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తనను అనర్హుడిగా ప్రకటించారని ఆరోపిస్తూ రఘురాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ అంశంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని తీర్పు ఇచ్చింది.

ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పు వచ్చే సమయానికే ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11 నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. 28న ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ ఎన్నిక జరుగుతుందా? ఈసీ ఎలాంటి నిర్ణయం తీసకుంటుంది? అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

జగన్ కు ఊహించని షాక్..

అయితే.. స్థానిక సంస్థల్లో మెజార్టీ ఉండడంతో ఈ సీటును దక్కించుకోవాలని వైసీపీ ప్లాన్ వేసింది. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడును అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అప్పల నాయుడు గెలుపు కోసం ఆ పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగి జిల్లా నేతలతో మాట్లాడారు. గెలపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

అయితే.. ఎన్నికను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడంతో జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. ఇటీవల వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదే ఊపుతో విజయనగరంలోనూ గెలిచి మండలిలో మరో సీటు దక్కించుకోవాలని భావించిన ఆ పార్టీకి హైకోర్టు తీర్పు, ఈసీ నిర్ణయంతో నిరాశే మిగిలింది.   

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe