అసెంబ్లీలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక రేసులో నిలవాలని నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది.

New Update
ys jagan

ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక రేసులో నిలవాలని నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఆయన ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. వాస్తవానికి పీఏసీఎస్ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రధాన పతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే 18 సీట్లు రావాల్సి ఉంది. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. పీఏసీఎస్ చైర్మన్ పదవి కూడా ఆ పార్టీకి దక్కే అవకాశం లేదన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియా యూజర్లకు సీఎం వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్‌ కేసు!

ఈ రోజుతో ముగియనున్న నామినేషన్లు..

పీఏసీఎస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది. దీంతో కూటమి నుంచి మరెవరైనా నామినేషన్ వేస్తారా? అన్న చర్చ సాగుతోంది. జనసేన పార్టీకి 21 మంది సభ్యుల బలం ఉంది. ఈ నేపథ్యంలో వారిలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది. మరికొద్ది సేపట్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. అసెంబ్లీకి దూరంగా ఉంటున్న జగన్.. అసలు పీఏసీఎస్ చైర్మన్ రేసులో వైసీపీ అభ్యర్థిని బరిలో ఉంచుతారా? లేదా? అన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆఖరి నిమిషంలో ఆయన వైసీపీ అభ్యర్థిని పోటీలో ఉంచడం చర్చనీయాంశమైంది. 
ఇది కూడా చదవండి: వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు సర్కార్ కొత్త స్కెచ్.. మరి కోర్టులు ఒప్పుకుంటాయా?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు