/rtv/media/media_files/2024/12/19/sUscq8A4MlsztprXhSSA.jpg)
tdp
TDP: తెలుగుదేశం పార్టీ అఫీషియల్ యూట్యూబ్ హ్యడిల్ ని గుర్తుతెలియని సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. కనీసం రికవరీ చేయడానికి కూడా వీల్లేకుండా ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రెస్సులు చేశారని టీడీపీ టెక్నీకల్ వింగ్ టీమ్ తెలిపారు. అయితే సైబర్ కేటుగాళ్లు మంగళవారం రాత్రి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఛానెల్ ఓపెన్ చేస్తే 'యూట్యూబ్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ వీడియోలను తొలగించాము' అన్నట్లుగా ఎర్రర్ మెసేజ్ చూపిస్తోందని టీమ్ వివరించారు. దీనిపై యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం ఛానెల్ ను రికవరీ చేసేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.
TDP youtube chanel hack aindaa?
— JaiBalayya (@Balaababu1) December 17, 2024
@JaiTDP pic.twitter.com/525wV8LaWE