/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇంకా ఈ ముగ్గురు తమ పాస్ పోర్టులను అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని అరెస్ట్ చేయగా.. నలుగురికి బెయిల్ చేసింది న్యాయస్థానం. బాలాజీ గోవిందప్ప మే 13న అరెస్టు కాగా.. మే 16న ధనుంజయ్, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇందులో గోవిందప్ప 117 రోజులు జైలులో ఉండగా.. మిగతా ఇద్దరు113 రోజులు జైలు జీవితం గడిపారు. గత ప్రభుత్వ హయాంలో ధనుంజయ్ రెడ్డి సీఎంఓ కార్యదర్శిగా వ్యవహరించారు. కృష్ణమోహన్ం రెడ్డి జగన్ ఓఎస్డీగా ఉన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ధనుంజయ్ రెడ్డిని ఏ-31గా, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని ఏ32గా, బాలాజీ గోవిందప్పను ఏ33గా చేర్చింది సిట్. కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా వీరి అరెస్ట్ జరిగింది.
ఏపీ లిక్కర్ కేసు నిందితులకు బెయిల్
— greatandhra (@greatandhranews) September 6, 2025
ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశం
12 మంది అరెస్టయిన నిందితుల్లో ఇప్పటివరకు నలుగురికి బెయిల్ pic.twitter.com/nWLLupR80F
ఏపీ లిక్కర్ స్కామ్ ఏంటి?
కొన్ని డిస్టిలరీలకు, బ్రాండ్లకు లబ్ధి చేకూర్చేలా గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పాలసీ ద్వారా కొత్తగా, అంతగా పేరులేని బ్రాండ్లకు ప్రాధాన్యత ఇచ్చి, వాటి అమ్మకాలు పెంచారని చెబుతున్నారు. టెండర్ల ప్రక్రియను కావాలని మాన్యువల్‌గా నిర్వహించి, ముందుగా అనుకున్న కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.