/rtv/media/media_files/2026/02/07/amaravati-2026-02-07-18-41-28.jpg)
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు ఒక భారీ అడుగు వేశారు. నేడు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి జరిగిన ఈ కార్యక్రమం ఏపీ టెక్నాలజీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యార్థుల చేతుల్లోనే ఉందని, అందుకే తన ఆశలన్నీ వారిపైనే ఉన్నాయని సీఎం అన్నారు. చరిత్రను రాయాలన్నా, లేదా ఉన్న చరిత్రను తిరగరాయాలన్నా అది ఒక్క యువతకే సాధ్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మన యువత టెక్నాలజీ రంగంలో క్వాంటం వేగంతో దూసుకుపోతోంది. వారికి సరైన వేదిక కల్పించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో కట్టిన హైటెక్ సిటీ ఆ నగరం యొక్క తలరాతను మార్చేసిందని, కానీ ఇప్పుడు అమరావతిలో నిర్మిస్తున్న ఈ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏకంగా దేశానికే గేమ్ ఛేంజర్ కాబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
క్వాంటం వ్యాలీ ప్రత్యేకతలు ఇవే
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో భారత్ లో మొట్టమొదటి పూర్తిస్థాయి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం ఒక టెక్ పార్క్ మాత్రమే కాదు, ప్రపంచంలోని టాప్-5 క్వాంటం కేంద్రాల్లో ఒకటిగా నిలవడమే దీని లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రధాన భవనం సుమారు 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 3D ప్రింటింగ్, ప్రీ-ఇంజనీరింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో గ్లోబల్ టెక్ దిగ్గజాలు IBM, TCS, L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. IBM, TCS కలిసి అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. వచ్చే కొద్ది కాలంలో క్వాంటం టెక్నాలజీలో ఒక లక్ష మంది నిపుణులను తయారు చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ వ్యవస్థ ద్వారా ఎవరైనా క్వాంటం రంగంలో నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం విశేషం. పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.
క్వాంటం వ్యాలీ వల్ల ప్రయోజనాలు
- ఎవరూ హ్యాక్ చేయలేనంత పటిష్టమైన సెక్యూరిటీ సిస్టమ్స్‌ను ఇక్కడ రూపొందిస్తారు.
- క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు కొత్త మందులను, వ్యాక్సిన్లను కనిపెట్టడంలో ఈ
- కంప్యూటింగ్ వేగం అద్భుతంగా పనిచేస్తుంది.
- ప్రకృతి వైపరీత్యాలను వంద శాతం కచ్చితత్వంతో ముందే పసిగట్టవచ్చు.
- స్టాక్ మార్కెట్ విశ్లేషణలు, ఆర్థిక లావాదేవీలు అత్యంత వేగంగా, భద్రంగా జరుగుతాయి.
Follow Us