JATHWANI: జెత్వానీ కేసులో ఐపీఎస్ కాంతి రాణాకు బిగుస్తున్న ఉచ్చు!

ముంబై నటి జెత్వాని కేసులో ఐపీఎస్ కాంతి రాణా టాటాకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. కాంతిరాణా పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

jtn
New Update

JATHWANI CASE: ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ఏపీ పోలీసులు వేగం పెంచారు. ఇందులో భాగంగానే శుక్రవారం జెత్వానిని వేధించినట్లు ఆధారాలు లభించడంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డెహ్రాడూన్‌లో విద్యాసాగర్‌ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన IPS కాంతి రాణాకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే కాంతి రాణాపై సస్పెన్షన్ వేటు వేయగా.. తాజాగా ఆయన అరెస్టుకు రంగం పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

ఎఫ్‌ఐఆర్‌ భయంతో బెయిల్ పిటిషన్.. 

ఈ సమాచారంతో జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేయకముందే.. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ బెయిల్ కోరారు. అయితే కాంతిరాణా పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. ఇప్పటికే డీజీపీ నివేదిక ఆధారంగా కాంతి రాణా టాటాతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు చేర్చకపోగా.. అధికారికంగా కాంతి రాణాపై కేసు నమోదు కాలేదు. ఇక విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా.. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని.. తప్పుడు సాక్ష్యాలు పుట్టించి తనను ఇబ్బందిపెట్టినట్లు జెత్వానీ ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయలు, విజయవాడ డీసీపీ విశాల్ గున్నీలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. దీంతో నెక్ట్స్ తననే విచారించి కీలక విషయాలను బయటకు లాగి కేసులు పెట్టే అవకాశం ఉందని భావించిన రాణా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

#actress-jatwani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe