South Central Railway-Sankranti: సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్​ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్​ ఓపెన్​ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.

author-image
By Bhavana
Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!
New Update

Sankranti Trains: సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ. ఏపీ నుంచి తెలంగాణ , ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్థిరపడ్డవారు కచ్చితంగా ఎక్కడ ఉన్న సంక్రాంతికి సొంతూరుకు చేరుకుంటారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఏపీ కి వెళ్లాలనుకునేవారు ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకోవడంతో రైళ్లన్ని నిండిపోయాయి. 

సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్​ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్​ ఓపెన్​ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం వెయిటింగ్ ​లిస్ట్ ​భారీగా పెరిగిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో టికెట్లు బుక్​ చేసుకుందామంటే ‘నో టికెట్స్’​అని చూపిస్తుంది. వెయిటింగ్ లిస్ట్​రిగ్రేట్ స్టేటస్​చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్ట్ ను తగ్గించేందుకు రెగ్యులర్​ రైళ్లకు అదనపు కోచ్​లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్లాన్​చేస్తున్నారు. అప్పటికీ సరిపోకపోతే మరో 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ ​నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే గరీబ్ రథ్, ఫలక్​నుమా, కోణార్క్, ఎల్​టీటీ ముంబై, గోదావరి, విశాఖ ఎక్స్​ప్రెస్​తో సహా అనేక ఎక్స్​ప్రెస్ రైళ్లు విశాఖపట్నం వైపు జనవరి 10, 11, 12 తేదీల్లో పూర్తిస్థాయిలో నిండిపోయాయి.

కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్​ప్రెస్, ఎల్ టీటీ- కాకినాడ ఎక్స్​ప్రెస్​రైళ్లు రిగ్రేట్​ స్టేటస్ చూపిస్తున్నాయని ప్రయాణికులు అంటున్నారు.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రైళ్లన్నీ ఏపీ మీదుగానే వెళ్తాయి. వీటన్నింటిలో కూడా టికెట్లు అయిపోయాయి. రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో 400 స్పెషల్ సర్వీసులు నడపాలని ప్లాన్​చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: BIG BREAKING: జానీ మాస్టర్ అరెస్ట్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe