ఏపీలో (Andhra Pradesh) ఓ మహిళా బీసీ అధికారి ట్రాన్స్ఫర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతలు తీసుకున్న ఆరు నెలల్లోనే ఆమెను బదిలీ చేయడంతో అధికారులతో పాటు ఏకంగా మంత్రి కార్యాలయం, సన్నిహితులపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ రీజనల్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీదేవిని ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో శివరామ ప్రసాద్ ను నియమించింది. హైకోర్టు (High Court) ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కొత్త వ్యక్తి శివ రామ ప్రసాద్‌ను డీపీసీ (Departmental Promotion Committee) లేకుండా జేటీసీగా పదోన్నతి కల్పించారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రవాణా శాఖ మంత్రి సన్నిహితులు భారీగా డబ్బు తీసుకుని పదోన్నతి ఇవ్వాలని కార్యదర్శి రవాణాపై ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం సాగుతోంది. శివరామ ప్రసాద్ పై 2 ఏసీబీ కేసులు ఉండడం గమనార్హం.
ఇది కూడా చదవండి: AP Liquor: మద్యం కోసం సిబ్బంది అతి తెలివి.. నివ్వెరపోయిన అధికారులు
6 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అతనిపై అభియోగాలు నమోదు చేయకపోవడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో అతను తనకు అనుకూలంగా ఆర్టర్స్ తెచ్చున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే విచారణను సస్పెండ్ చేసిన హైకోర్టు అతడికి పదోన్నతి కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సూపర్‌న్యూమరీ పోస్టును మంజూరు చేసి.. డీపీసీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొందేలా చేశారని ప్రచారం సాగుతోంది.
పదోన్నతిపై 6 నెలల క్రితమే జేటీసీగా నియమితులైన జేటీసీ శ్రీదేవి స్థానంలో శివరామ ప్రసాద్‌ను విజయవాడ జేటీసీగా నియమించడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు కారణమైంది. మంత్రి సన్నిహితులే నేరుగా రూ.50 లక్షలు తీసుకుని సెక్రటరీని బలవంతం చేసి ఇదంతా చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. సెక్రటరీ, శివరామప్రసాద్ ఒకే వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో నిబంధనలకు విరుద్ధంగా ఓ బీసీ మహిళా అధికారిని పక్కన పెట్టి, ఆమెకు అన్యాయం చేశారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు.