తిరుమల కొండపై చిరుత దాడిలో గాయపడ్డ బాలుడికి ఎంత ఖర్చైనా సరే, మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను టీటీడీ చైర్మన్ ఆదేశించినట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందన్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని అన్నారు. అదే విధంగా తిరుమలలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మెట్ల మార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడక మార్గంలో భద్రతను మరింతగా పెంచుతామని తెలిపారు.
కాగా.. తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆధోనికి చెందిన భక్తులు అలిపిన నడకమార్గంలో వెళ్తండగా బుధవారం బాలుడిని చిరుత లాక్కెళ్లింది. భక్తులు కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలో కొద్ది దూరంలో వదిలేసి వెళ్లింది. చిరుత దాడిలో బాలుడి చెవి వెనక, మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పద్మావతి చిల్ట్రన్ ఆసుపత్రిలో బాలుడు కౌశిక్‌కు చికిత్స అందిస్తున్నారు.