చిరుత దాడిలో గాయపడ్డ బాలుడిని పరామర్శించిన టీటీడీ చైర్మన్
తిరుమల కొండపై ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కౌశిక్‌ను శుక్రవారం ఉదయం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.
