Tirupati: ఆడ పిల్లల సంరక్షణకై ఎన్ని చట్టాలు తెచ్చినా అవి నేరాలను అదుపుచేయలేకపోతున్నాయి. ఆడ పిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లలు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధురాలు అనే తేడా కూడా లేకుండా.. కామాంధులు పశువుల మారి వారి కోరికను తీర్చుకుంటున్నారు. తాజాగా, తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జువైనల్ హోమ్ లో ఉండే బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలోనే గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో ఓ బాలిక 9వ తరగతి చదువుతుంది. అయితే, ఆ బాలికపై స్కూల్ లోనే అత్యాచారం జరిగింది.
గతంలో ఈ బాలిక ఉన్న సత్యవేడులోని హోమ్ వద్ద ఉండేది. అక్కడ హాస్టల్‌కు సరకులు సరఫరా చేసే రిషి అనే యువకుడు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అయితే, ఈ నెల 21న బాలిక చదువుతున్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్దకు వెళ్లి స్టడీ అవర్‌లో బాలికపై అత్యాచారం చేశాడు. ఒంటిపై గాయాలతో సాయంత్రం బాలిక హోమ్‌కి వెళ్లగా తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది ప్రశ్నించారు. దీంతో బాలిక జరిగిన విషయం వారికి తెలిపింది.