Andhra Pradesh: దేశంలోనే అత్యధికంగా మహిళలపై దాడులు జరిగిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, ఇందుకు కారణం వైసీపీ(YCP) ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ(TDP) నాయకురాలు వంగలపూడి అనిత(Anitha). మంగళవారం మీడియాతో మాట్లాడిన అనిత.. పొట్ట చేత పట్టుకుని విశాఖ(Vizag)కు వచ్చిన ఓ దళిత కుటుంబానికి చెందిన 11 మంది చేతిలో అత్యాచారానికి గురైందన్నారు. ఇంత జరిగితే మహిళా కమిషన్ చర్యలు మాత్రం శూన్యం అని విమర్శించారు. సుమోటోగా తీసుకున్నానని అని ఆదేశిలివ్వడం మినహా వారు చేసిందేమీ లేదని విమర్శించారు. బాధిత బాలికను మహిళా కమిషన్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు అనిత. మహిళా హోం మంత్రి ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వైసీపీ మంత్రులు సీట్లు మార్చే సరికి ముందే పదవి అయిపోయిందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ దారుణ ఘటనపై పోలీసులు ఎందుకు సమాచారం చెప్పడం లేదని ప్రశ్నించారు అనిత. రాష్ట్రంలో క్రైమ్స్‌పై డీజీపీ తప్పుడు లెక్కలు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని గొప్పలు చెప్తున్నారని అన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 25వేల నేరాలు జరిగాయని.. కానీ, జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.48 లక్షల నేరాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందే చెప్పారని అనిత గుర్తు చేశారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 40 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని అన్నారు. మాట్లాడితే దిశ పేరు చెప్పి.. బాధిత కుఉటంబానికి ఇంకా బాధపెడుతున్నారని ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందు జగన్ వస్తాడని సినిమా డైలాగ్స్ కొట్టడం తప్ప వారు చేసేదేమీ లేదని విమర్శించారు అనిత. దిశ చట్టానికి చట్టబద్ధత తీసుకురానందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దిశ యాప్ పని చేసి ఉంటే.. ఆ బాలిక మీద అత్యాచారం జరిగేదా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నాయకురాలు అనిత.
Also Read: