TDLP Boycott Assembly: టీడీఎల్పీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలపై తెలుగుదేశం శాసనసభా పక్షం(TDLP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి(సోమవారం) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీడీఎల్పీ ఒక ప్రకటన విడుదల చేసింది. By Shiva.K 25 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి TDLP Boycotts Assembly Meeting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలపై తెలుగుదేశం శాసనసభా పక్షం(TDLP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి(సోమవారం) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీడీఎల్పీ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇదే విషయమైన ఇవాళ భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాలు నిర్వహణపై చర్చించనున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వనందున ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెప్తామమని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే టీడీఎల్పీ భేటీలో తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. టీడీపీ ప్లాన్ పాప్..! చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని చాటి చెప్పేందుకు అసెంబ్లీనే అనువైన వేదిక అని భావించిన టీడీపీ.. ఇప్పుడు ఆ వేదికను బహిష్కరించి.. పెద్ద చేసిందని పొలిటికల్ అనలిస్ట్‌లు అంటున్నారు. అసెంబ్లీ ద్వారా ప్రజలకు మ్యాటర్‌ను వివరించడంలో టీడీపీ నేతలు ఫెయిల్ అయ్యారని టాక్ నడుస్తోంది. అధికార పక్షం ఆరోపణలను తిప్పి కొడుతూ.. యావత్ ఆంధ్ర లోకానికి సమాధానం చెప్పే ఏకైక వేదిక అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా టీడీపీ నేతలు పెద్ద తప్పు చేశారని విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రజలు తప్పకుండా గమనిస్తారు. ఇలాంటి అసెంబ్లీలో.. చంద్రబాబు అరెస్ట్, అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. కానీ, ఆ ప్రయత్నం చేయకుండా.. కేవలం నాలుగు రోజులు నిరసన తెలిపి.. ఆపై సభను బహిష్కరించడం వలన టీడీపీకే మైనస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. స్కిల్ స్కామ్‌పై సభలో మాట్లాడితే నేరుగా ప్రజలకు చేరేదని, కానీ సరైన వ్యూహం లేక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధమన్నా.. బహిష్కరణ నిర్ణయం.. సాధారణంగా సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఉంటుంది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఈ గోల మరింత పీక్స్‌కి చేరింది. వాస్తవానికి ప్రతిక్షాలు తమకు మైక్ ఇవ్వడం లేదని అధికారపక్షంలో ఆరోపణలు చేస్తుంటారు. కానీ, చంద్రబాబు విషయంలో ప్రభుత్వమే చర్చకు సిద్ధం అని ప్రకటించినా.. టీడీపీ నుంచి స్పందన లేదు. చంద్రబాబుపై పెట్టిన కేసులు కొట్టివేయాలంటూ టీడీపీ సభ్యులు వరుసగా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారని, వీటిపై చర్చకు ప్రభుత్వం సిద్ధం అని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. అయితే, టీడీపీ నేతలు వినకుండా.. నిరసన తెలుపడంతో స్పీకర్ వారిని సస్పెడ్ చేశారు. సభ తొలి రోజు అలాగే జరిగింది. రెండో రోజు కూడా అలాగే జరిగింది. ప్రభుత్వం అంగీకరించి నేపథ్యంలో.. అంశంపై చర్చ చేపట్టి.. తమ వాదనను బలంగా వినిపిస్తే అసెంబ్లీ వేదికగా ప్రజలకు విషయం చేరి ఉండేది అని రాజకీయ వర్గాల విశ్లేషణ. చంద్రబాబుతో ములాఖత్..? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉంటున్నప్పటి నుంచి ఆయన కుటుంబం మొత్తం రాజమండ్రిలోనే షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. లోకేష్ క్యాంపు ఏర్పాటు చేసుకుని పరిస్థితులను పరిశీలిస్తూ.. అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ఈ క్యాంపులోనే ఉంటున్నారు. అయితే, ఇవాళ జైల్లో చంద్రబాబుతో నారా భువనేశ్వరి ములాఖత్ అవనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు భువనేశ్వరి. ఇప్పటికే క్యాంపు నుంచి అన్నవరం బయలుదేరారు. స్వామి వారి దర్శనం తరువాత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి 11 గంటలకు చేరుకుంటారు. ఆ దీక్షలో తాను కూడా పాల్గొననున్నారు భువనేశ్వరి. అసెంబ్లీ ముందుకు 9 బిల్లులు.. Also Read: కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే! చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం #andhra-pradesh #chandrababu-arrest #tdlp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి