AP: నెల్లూరులో భానుడి తీవ్ర ప్రభావం.. విలవిలలాడుతున్న జనం..!

నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండల కారణంగా ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. వర్షాకాలంలో కూడా ఎండాకాలం తలపిస్తోందని ప్రజలు అంటున్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటికి రాని పరిస్థితి నెలకొంది.

New Update
AP: నెల్లూరులో భానుడి తీవ్ర ప్రభావం.. విలవిలలాడుతున్న జనం..!

Nellore: నెల్లూరు జిల్లాలో గత వారం రోజులుగా తీవ్ర ఎండల కారణంగా ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉదయం 11 దాటితే సాయంత్రం వరకు కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఎప్పుడు జనంతో కిటకిటలాడే ప్రధాన వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. జిల్లా మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: మలేషియాలో కుప్పం మహిళ మృతి.. బాధిత కుటుంబానికి సాయంపై సీఎం హామీ..!

ఎండల తీవ్రత కారణంగా తమ వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలంలో కూడా మరోసారి ఎండాకాలం వచ్చినట్టుగా ఉందని ప్రజలు వాపోతున్నారు. తీవ్ర ఎండల కారణంగా తమ పనులు కూడా చేసుకోలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు.

Advertisment
తాజా కథనాలు