AP Assembly: బాలయ్యకు ఇది మంచి ఛాన్స్.. పార్టీని టేకోవర్ చేసుకొండంటూ అంబటి సూచన..

బాలకృష్ణ గతంలో ఏనాడూ ఇంత యాక్టీవ్‌గా లేరని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. మీసం మీ పార్టిలో తిప్పండి.. శాసనసభలో ‌కాదు అంటూ బాలయ్యకు సూచించారు మంత్రి అంబటి.

AP Assembly: బాలయ్యకు ఇది మంచి ఛాన్స్.. పార్టీని టేకోవర్ చేసుకొండంటూ అంబటి సూచన..
New Update

Andhra Pradesh Assembly 2nd Day: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ(TDP) నేతల నిరసనలతో ఏపీ అసెంబ్లీ(AP Assembly) దద్దరిల్లిపోతోంది. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టివేయాలని, ఆయన్ని విడుదల చేయాలంటూ సభా వేదికగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అయితే, ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులు, టీడీపీ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నేతల ఆందోళనపై కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ప్రాపర్ ఫార్మెట్ లో‌ వస్తే అసెంబ్లీలో చర్చించడానికి సిద్దంగా వున్నామని స్పష్టం చేశారు మంత్రి. చర్చలో పాల్గొనాలని, పారిపోవద్దంటూ టీడీపీ నేతలకు చురకలంటించారు.

బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్..

బాలకృష్ణ గతంలో ఏనాడూ ఇంత యాక్టీవ్‌గా లేరని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. మీసం మీ పార్టిలో తిప్పండి.. శాసనసభలో ‌కాదు అంటూ బాలయ్యకు సూచించారు మంత్రి అంబటి. 'మీ తండ్రి వెన్నులో కత్తి దిగిన సంగతి గుర్తు తెచ్చుకో. బాలయ్యకు ఇది మంచి అవకాశం. ఎన్టీఆర్ కుమారులు తండ్రికి ద్రోహం చేశారానే అపవాదు ఉంది. ఇప్పుడు దానిని తుడిచేసే ఛాన్స్ వచ్చింది. పార్టీ పగ్గాలు మీరే తీసుకోండి. మీ ప్రతాపం చూపించండి. మీ మీద పడిన మచ్చను తొలగించుకోండి. మీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకోండి. మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చలో పాల్గొనండి. మీ వాదనలను సభలో చెప్పుకోండి. శాసనసభలో నియమనిబంధనలు పాటించకపోతే, తప్పుచ చేస్తే యాక్షన్ ఉంటుంది. టీడీపీ సభ్యులు రాగానే గందరగోళం చేస్తున్నారు.' అంటూ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీసం తిప్పిదే వేటు తప్పదు..

'గురువారం సభ తొలి రోజున బాలకృష్ణ ముందుండి టీడీపీ సభ్యులను నడిపారు. టీడీపీని కూడా బాలకృష్ణ నడపాల్సిన అవసరం ఉంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా బాలయ్య ఇంతగా బయటకు రాలేదని, బావ కోసం బాలయ్య విపరీతంగా ఆరాటపడుతున్నారు' అంటూ బాలయ్యపై విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణ ప్రవర్తించారని, అందుకే స్పీకర్ హెచ్చరిక ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ఈ రోజు కూడా బాలకృష్ణ మీసాలు తిప్పితే సభ నుండి సస్పెండ్ చేస్తారని స్పష్టం చేశారు.

Also Read:

Andhra Pradesh: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..

Telangana: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు.. మరో పది రోజుల్లో పంపిణీ..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe