Jagan: ఫార్మా బాధితులను పరామర్శించిన జగన్.. మా హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు అంటూ..

అనకాపల్లి ఆసుపత్రిలో ఫార్మా బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధకలిగిస్తోందన్నారు. కనీసం అంబులెన్స్ లను కూడా పంపించలేదన్నారు.

New Update
Jagan: ఫార్మా బాధితులను పరామర్శించిన జగన్.. మా హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు అంటూ..

Jagan: అనకాపల్లి ఆసుపత్రిలో ఫార్మా బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఎసెన్షియా ప్రమాద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో 18 మందికి చికిత్స పొందుతున్నారు. జగన్ వెంట ఆస్పత్రికి మాజీ మంత్రులు బొత్స, అమర్‌నాధ్ , ధర్మశ్రీ తదితరులు వెళ్లారు.

ఆసుపత్రి బయటకు వచ్చిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధకలిగిస్తోందన్నారు. కనీసం అంబులెన్స్ లను కూడా పంపించలేదని విమర్శలు గుప్పించారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.

Also Read: ఏపీలో మరో భారీ ప్రమాదం

ఇలాంటి ఘటనే మా హయాంలోనూ జరిగిందని.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 24 గంటల్లోనే పరిహారం అందించామన్నారు. బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇచ్చిన మొదటి ప్రభుత్వం తమదేనన్నారు. జగన్ హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయంటూ చంద్రబాబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు.

డైవర్ట్ చేసేలా చంద్రబాబు మాట్లాడారని.. ప్రభుత్వం సరైన దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావన్నారు. ఇప్పటి సీఎస్ ఆధ్వర్యంలోనే అప్పట్లో కమిటీ వేశామని.. మా హయాంలో ప్రాపర్ ప్రోటోకాల్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రజల కన్నా.. రెడ్‌బుక్ మీదే ఈ ప్రభుత్వం దృష్టిపెట్టిందని.. కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు