Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపు రెగ్యులరైజ్..

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయనున్నారు.

New Update
Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి లోపు రెగ్యులరైజ్..

Contract Employees Regularise: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ గైడ్‌లైన్స్‌ని జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్ట్ ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసెలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ వారి జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున హృదయపూర్వక కృతజ్ఞలు తెలియజేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి, సెక్రెటరీ జనరల్ ఆరవ పాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

publive-imagepublive-imagepublive-imagepublive-image

Also Read:

ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?

ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Advertisment
తాజా కథనాలు