ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ ఉప జిల్లాల్లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లు ఏర్పాటవుతాయని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా.. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 లోని సెక్షన్ 5 ప్రకారం.. ఈ కొత్త ఉప జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరుపున ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన ఉప జిల్లాల్లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటవుతాయని ప్రభుత్వం తెలిపింది.
దీంతో పాటుగా.. కొత్త ఉప జిల్లాల్లోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిని కూడా నోటిఫికేషన్ లో తెలిపింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 లోని సెక్షన్ 5 ప్రకారం.. ఈ కొత్త ఉప జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉత్తర్వుల్లో చెప్పిన గ్రామాలు ఇకనుంచి కొత్త ఉప జిల్లాల పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిని కూడా ఈ ఉత్తర్వుల్లో ప్రకటించింది.