Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. పలువురికి పదోన్నతులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మరికొందరికి పన్నోతులు కల్పించింది. దాదాపు 17 మంది అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్‌, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె. శివ శ్రీనివాస్‌ను నియమించింది సర్కార్.

New Update
YCP Focus:  విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!

IAS Officers Transferred: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అధికారుల బదిలీల పర్వం నడుస్తోంది. ఇటు తెలంగాణలో ఏఐఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల పరంపర కొనసాగుతుండగానే.. మరోవైపు ఏపీలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మరికొందరికి పదోన్నతి కల్పించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారుల వివరాలు..

☛ శాప్ వీసీ, ఎండీ గా హెచ్.ఎం. ధ్యానచంద్ర.
☛ విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్.
☛ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె. శివ శ్రీనివాస్.
☛ తిరుపతి జిల్లా జేసీగా శుభం బన్సాల్.
☛ విలేజ్, వార్డు సెక్రటేరియట్ అడిషనల్ డైరెక్టర్‌గా గీతాంజలి శర్మ.
☛ సత్యసాయి జిల్లా జేసీగా అభిషేక్ కుమార్.
☛ అల్లూరి జిల్లా జేసీగా కొల్లాబత్తుల కార్తీక్.
☛ MSME కార్పోరేషన్ సీఈవోగా సేదు మాధవన్.
☛ మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ గా ఎస్ఎస్ శోభిక.
☛ పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి ధాత్రి రెడ్డి.
☛ పెనుకొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్.
☛ కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ.
☛ కందుకూరు సబ్ కలెక్టర్ గా గొబ్బిల విద్యాధరి.
☛ తెనాలి సబ్ కలెక్టర్‌గా ప్రకార్ జైన్.
☛ మార్కాపురం సబ్ కలెక్టర్‌గా రాహుల్ మీనా.
☛ ఆదోని సబ్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ.
☛ రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఎస్.ప్రశాంత్ కుమార్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

publive-image

Also Read:

కొత్త రేషన్ కార్డులపై సర్కార్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 28 నుంచే దరఖాస్తులు..!

హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు