/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Road-accident-in-Warangal-district-jpg.webp)
Road Accident in Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొని నలుగురు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై కారు, ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, చనిపోయిన వారు మాబు, అభినయ్(10), వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి కారణం అతివేగమని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 90 శాతం వరకు.. వివరాలివే!
ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు!